ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటెనేమయ్య ఈశ్వరా
రాగం : శివరంజని
తాళం : ఖండ జాతి 5/8
ఎవరికి ఎవరయ్య ఈశ్వరా
ఎవరుంటెనేమయ్య ఈశ్వరా
మరు జన్మ రాకుండా చూడరా
నీ దయ ఉంటే చాలయ హార హారా
నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా
నీ దయ ఉంటే చాలు పరమేశ్వర
ఎవరికి ఎవరయ్య ఈశ్వరా
ఎవరుంటెనేమయ్య ఈశ్వరా
ఎవరుంటెనేమయ్య ఈశ్వరా
ఈ కనులు తెరవగా జననం
ఈ కనులు మూస్తేనే మరణం
రెప్పపాటయ్య ఈ జీవనం
విధి మార్చతరమా బ్రహ్మకైన
పరమేశ్వర....ఆ.....ఆ....
పరమేశ్వర కరుణించరావా
హర హర మహాదేవ శంభో శంకర
హర హర మహాదేవ శంభో శంకర
ఎవరికి ఎవరయ్య ఈశ్వరా
ఎవరుంటెనేమయ్య ఈశ్వరా
ఎవరుంటెనేమయ్య ఈశ్వరా
నేను నేననే అహము
నాది నాదనే స్వార్ధం
కలుషితంబయ్యె ఈ జీవితం
ఇక చాలునయ్య ఈ నాటకం
లయకారక...ఆ...ఆ...
లయకారక ఇక చాలిక
అర్ధనారీశ్వర గౌరీశంకర
అర్ధనారీశ్వర గౌరీశంకర
ఎవరికి ఎవరయ్య ఈశ్వరా
ఎవరుంటెనేమయ్య ఈశ్వరా
మరు జన్మ రాకుండా చూడరా
నీ దయ ఉంటే చాలయ హార హారా
నీ దయ ఉంటే చాలు రా ఈశ్వరా
నీ దయ ఉంటే చాలు పరమేశ్వర