రాగం : బృందావన సారంగ
తాళం : తిశ్రగతి నడక 6/8
ఒక్కసారి రావాలని స్వామి
ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి
వేడి వేడి అన్నంలో వెన్నపూసనే వేస్తా
ఆవకాయ వడ్డించి పక్కనుండి తినిపిస్తా
"ఒక్కసారి రావాలని స్వామి"
పండ్లు తెచ్చి పెట్టేందుకు శభరమ్మను కాన్నయ్య
ఫలహారా లిచ్చేందుకు మహరాజును కానయ్య
పేదింట్లో వంట తింటే పేరేమీ తరగదులే
గొంగట్లో కూర్చుంటే నీ గొప్పేమీ తరగదులే
" ఒక్కసారి రావాలని స్వామి"
పూల పరుపు వేసేందుకు దొరల బిడ్డ కాన్నయ్య
గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా
అరుగు మీద కూర్చుంటా తొడ మీద ఒరుగు స్వామి
నీ తలను కాస్త నిమురుతుంటా నిదురదీయి నా తండ్రి
"ఒక్కసారి రావాలని స్వామి"
పిడికెడన్ని అటుకులకే పొంగిపోయినా వంట
పడవ నిన్ను దాటిస్తే పరవసించి నా వంట
ఎంతటి దయగలవాడో వెంకటేశు డనుకుంటే
అంతటి నా స్వామి నువ్వు నా ఇంటికి రావేంటి
"ఒక్కసారి రావాలని స్వామి"
For this song Karaoke Whatsapp : 9248951498