మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా
ప్రాణం పోశావా మహేశా మనిషిగా చేసావా...
మట్టి తీశావా...
తల్లి గర్భమున నన్ను
తొమిది నెలలు ఉంచావు
పిమ్మట మమ్ము భూమి పై వేసి
పువ్వులాగా తుంచేస్తున్నావు
మట్టి తీశావా...
కులములోన పుట్టించావు
కూటికి భేదం చేశావు
కర్మబంధాల ముడినే వేసి
తుటిలోనే తుంచేస్తున్నావు
మట్టి తీశావా...
కోటీశ్వరుని చేశావు
కోటలెన్నో కట్టించావు
సిరి సంపదలు సిధిలం చేసి
కాటి లోనే కలిపేస్తున్నావు
మట్టి తీశావా...
For this Song Karaoke Whatsapp : 9248951498