బృందావన సారంగ రాగం
బాసర సరస్వతి బంగారు బొమ్మ
దోసిలి యొగ్గితిని దీవించ వమ్మ
శరణు శరణు శరణు శ్రీ సరస్వతీ శరణు
శరణు శరణు శరణు జ్ఞాన సరస్వతి శరణు
నీ వీణా నాదము నా మదిని నింపవమ్మా
నీ అందెల సవ్వడితో నర్తించవమ్మ
నీవే నా నాలుక పై నిలచి పలుకవమ్మ
నీవే మా తోడై మము నడిపించవమ్మ (2)
కవుల కలములను ముందుకు కదలించవమ్మ
గాయకుల కంఠమందు నిండి వరలుమమ్మ
విద్యార్థుల వెంట నిలచి విజయ మొసగుమమ్మ
నీ పుత్రుల కెటుపోయినా ఎదురు లేదు కదమ్మా (2)
బాసర సరస్వతి బంగారు బొమ్మ
దోసిలి యొగ్గితిని దీవించ వమ్మ
శరణు శరణు శరణు శ్రీ సరస్వతీ శరణు
శరణు శరణు శరణు జ్ఞాన సరస్వతి శరణు