Sri Rama Kalyaname Vennela Song Lyrics In Telugu


 

శ్రీ రామ కళ్యాణమే వెన్నెలా 
సీతమ్మ వైభోగమే వెన్నెలా (2)


అయోధ్య పురమున వెన్నెలో వెన్నెలా 
దశరథ మహారాజంట వెన్నెలో వెన్నెలా 
ఆ రాజుకు ముగ్గురు వెన్నెలో వెన్నెలా 
రాణులే కలరంట వెన్నెలో వెన్నెలా 
కౌసల్య సుమిత్ర వెన్నెల 
కైకేయి చిన్న రాణి వెన్నెల వెన్నెలా


శ్రీ రామ కళ్యాణమే వెన్నెలా 
సీతమ్మ వైభోగమే వెన్నెలా 


ఆ రాజుకు కొడుకులు వెన్నెల్లో వెన్నెలా 
నలుగురు కలరంట వెన్నెల్లో వెన్నెలా
 శ్రీరామ లక్ష్మణులు వెన్నెలో వెన్నెలా 
భరత శత్రుఘ్నులంట వెన్నెలో వెన్నెలా 
శ్రీ రామ చంద్రుడంట వెన్నెలా 
గారాల కొడుకంట  వెన్నెల వెన్నెలా 

శ్రీ రామ కళ్యాణమే వెన్నెలా 
సీతమ్మ వైభోగమే వెన్నెలా 

జనక మహారాజునకు వెన్నెలో వెన్నెలా 
ఏకైక పుత్రికట వెన్నెల్లో వెన్నెలా 
ఆ తల్లి పేరేమో వెన్నెల్లో వెన్నెలా 
సీతమ్మ దేవియట వెన్నెలో వెన్నెలా 
సీతమ్మకు రామయ్యకు వెన్నెలా 
కళ్యాణం జరిగెనంట వెన్నెల వెన్నెలా

శ్రీ రామ కళ్యాణమే వెన్నెలా 
సీతమ్మ వైభోగమే వెన్నెలా 

ముత్యాల పందిట్లో వెన్నెల్లో వెన్నెలా 
రతనాల తలంబ్రాలు వెన్నెలో వెన్నెలా 
సీతారామ కళ్యాణం వెన్నెలో వెన్నెలా 
లోక కళ్యాణమంట వెన్నెలో వెన్నెలా 
కళ్యాణం చూచినచో వెన్నెలా 
మన అందరి జన్మ ధన్యమంట 
వెన్నెల వెన్నెలా 

శ్రీ రామ కళ్యాణమే వెన్నెలా 
సీతమ్మ వైభోగమే వెన్నెలా 

For Karoke : Whatsapp 9248951498




Previous Post Next Post