తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు
వెళ్ళి పోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమె గాని
మెరుగు బంగారంబు మ్రింగబోడు
విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని
కూడబెట్టిన సొమ్ము కుడువబోడు
పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి
ధాన దర్మములు లేక దాచి దాచి
తుదకు దొంగల కిత్తునో దొరలకవునో
తేనె జుంటీగలియ్యవా తెరువరులకు
భూషణవికాస శ్రీ ధర్మ పురనివాస
దుష్ట సంహార నరసింహ దురితధూర
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
లోక మందెవడైన లోభి మానవుడున్న
బిక్షమర్దికి చేత పెట్టలేడు
తాను పెట్టకయున్న తగవు పుట్టదు గాని
వొరులుపెట్టగ చూసి ఓర్వలేడు
ధాత దగ్గరచేరి తన ముల్లె చెడినట్లు
జిహ్వ తో చాడీలు చెప్పు చుండు
ఫలము విఘ్నంబైన పలు సంతసము నొందుచు
మేలు కలిగిన చాలు మిడుకు చుండు
శ్రీ రమానాధ ఇటువంటి క్రూరునకు
బిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు
భూషణ వికాస శ్రీ ధర్మ పురనివాస
దుష్ట సంహార నరసింహ దురితధూర
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
పాంచబౌతికము దుర్బరమైన కాయంబిదిన్
ఎన్నాళ్లుండునో ఎరుకలేదు
శతవర్షముల దాక మితము చెప్పిరి గాని
నమ్మరాదామాట నెమ్మనమున
బాల్యమందో మంచి ప్రాయమందో
లేక ముదిమి యందో లేక ముసలితనమునో
వూరనో అడవినో ఉదక మద్యముననో
ఎప్పుడో ఎక్కడో ఏవేళనో ఏక్షణంణంబో
మరణమే నిచ్చయము బుద్ధి మంతుడైన
దేహమున్నంతలో మిమ్ము తెలియవలయునయా
భూషణ వికాస శ్రీ ధర్మ పురనివాస
దుష్ట సంహార నరసింహ దురితధూర
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
నీమీద కీర్తనల్ నిత్యగానము చేసి
రమ్యమొందిపగ నే నారదుడను గాను
సావదానముగ నీ చరణపంకజసేవ సలిపి
మెప్పింపగ నే భక్త శభరి గాను
బాల్య మప్పటి నుండి భక్తి నీయందు
కలుగుటకు నే భక్త ప్రహ్లాదుడను గాను
ఘనముగా నీమీద గ్రందముల్ కల్పించి
వినుతి చేయగ వ్యాసమునిని గాను
సాదుడను మూర్ఖమతిని
మనుష్యాధముడను హీనుడను సుమ్మీ
నీవే నన్ను రక్షించుమా నీవే నన్ను
కాపాడుమా నీవే నన్ను కరుణించుమా
భూషణ వికాస శ్రీ ధర్మ పురనివాస
దుష్ట సంహార నరసింహ దురితధూర
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణచుంటలు సభాపూజ్యులైరి
సత్యవంతులమాట జనవిరోదంబాయె
వగరు బోతుల మాట వాసికెక్కె
దర్మ వాధన పరుల్ దారిద్ర్యమెందిరి
పరమలోబులు ధన ప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగ బాదా పీడితు లైరి
దుష్ట మానవులు అదిక వర్తిష్టు లైరి
పక్షి వాహన మావంటి బిక్షకులకు
శక్తి లేదాయె ఇక నీవే దిక్కు మాకు
శక్తి లేదాయె ఇక నీవే రక్ష మాకు
భూషణ వికాస శ్రీ ధర్మ పుర నివాసా
దుష్ట సంహార నరసింహా దురితధూర
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
దేహమున్నంత వరకు మోహ
సాగరమందు మునుగుచుందురు
సుద్దమూడ జనులు
సలలిత ఐశ్వర్య ముల్ శాశ్వతం
బనుకొని షడ్ బ్రమలను మాన జాలరెవరు
సర్వకాలము మాయ సంసార భద్దులై
గురుని కారుణ్యంబు కోరు కొనరు
భక్తి జ్ఞాన విరక్తులైన పెద్దలన్ జూసి
నిందజేయక తాము నిలువలేరు
మధోన్ మత్తులైనట్టి దుర్జాతి
మనుజులెల్ల నిన్ను గనలేరు ఎన్నటికీ నీరజాక్ష
భూషణ వికాస శ్రీ ధర్మ పురనివాస
దుష్ట సంహర నరసింహ దురితధూర
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
గౌతమి స్నానాన కడతేరు దామంటె
మునసి చన్నీళ్ళలో మునగలేను
తీర్థయాత్రలు చేసి కృతార్దుడ నౌదామంటె
వడలి నీమంబు నే నడుపలేను
ధాన ధర్మములు చేసి సద్గతిని చెందుదమంటె
ఘనముగా నాయొద్ద ధనము లేదు
తపమాచరించి జన్మ సార్దక మొందెదమంటె
నిముషమైన మనసు నిలుపలేను
కష్టముల కొర్వ నా చేతకాదు నిన్నే స్మరణ చేసెద
యదా శక్తి కొలది నన్ను అనుగ్రహించు నారసింహ
భూషణవికాస శ్రీ ధర్మ పురనివాస
దుష్ట సంహార నరసింహ దురితధూర
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
పద్మలోచన సీస పద్యములు నీమీద
చెప్ప బూనితినయ్య చిత్తగింపు
ఘన యతి ప్రాస లక్షణము చూడగలేదు
పంచ కావ్య శ్లోక పఠన లేదు
అమర కాండ త్రయంబు అరచి చూడగలేదు
శాస్త్రీయ గ్రంథముల్ చదవలేదు
నీ కటాక్షంబున నే రచించెద గాని
ప్రజ్ఞ నాది కాదు ప్రస్తుతింప
తప్పు గల్గిన సద్భక్తి తక్కువౌనే
చెరకునకు వంక బోయిన చెడునే తీపి
భూషణవికాస శ్రీ ధర్మ పురనివాస
దుష్టసంహార నరసింహ దురితదూర
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
తనువులో ప్రాణముల్ తరలి పోయెడి వేళ
నీ స్వరూపమునే ధ్యానించు నతడు
నిముష మాత్రము లోన నిన్నే చేరును గాని
యముని చేతికి చిక్కి శ్రమలు పడడు
పరమ సంతోషముగా నీభజన చేసేడివారి
(పరమ సంతోషమ్ముగా నిన్ను కీర్తించెడివారి)
పుణ్య మేమనగ వచ్చు బోగిశయనా
మోక్షము నీదాస దాసులకే గాని
నరకమెక్కడి దయ్యా నళిన నేత్ర
కమల లోచన నీమహిమలు కానలేని
తుచ్యులకు ముక్తి దొరకుట దుర్లబంబుకదా నీరజాక్ష
భూషణవికాస శ్రీ ధర్మ పురనివాస
దుష్ట సంహార నరసింహ దురితధూర
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
ఆయురారోగ్య పుత్రార్ద సంపదలన్ని
కలుగజేసేడి కార్యకర్తవు నీవే
చదువు లెస్సగ నేర్పి సభలో
గరిష్టాదికార మొందించెడి గనుడవు నీవె
నడక మంచిది పెట్టి నరులు
మెచ్చెడి నట్లు పేరు రప్పించెడి పెద్దవు నీవె
భలుపైన వైరాగ్య భక్తి జ్ఞానము
లిచ్చి ముక్తి పొందించెడి మూర్తి నీవె
అవనిలో మానవుల కెల్ల ఆశలు
కల్పించి వ్యర్దులను చేసి తెలిపెడి వాడనీవె
భూషణవికాస శ్రీ ధర్మ పురనివాస
దుష్ట సంహార నరసింహ దురితధూర