Sarva Veda Roopini Song Lyrics in Telugu


 సర్వ వేద రూపిని సర్వ కారిణి 
సర్వ హృదయ సంచారిణి సర్వుని రాణి 
కరుణారస వరదాయిని కాత్యాయని 
కామకోటి పీఠస్థిత కనకదుర్గ 

శరణు శరణు శరణు శరణు    వరముల దొరసాని 
చరణకమలములు నమ్మితి   అమ్మ   భవాని 

స్వామి తనువులోన సగము సంతరించి 
అమ్మవు అయ్యావు నీవై అలరినావు 
సర్వ మంత్ర  తంత్రమమ్మలు కాపాడుమా 
సర్వశక్తి యువతులకు స్థావరమా
శరణు శరణు శరణు శరణు    వరముల దొరసాని 
చరణకమలములు నమ్మితి అమ్మ భవాని 

చండ భాను వర్ణ నేత్ర శత్రునాశని 
సల్లలిత శశాంక నేత్ర సాధు పోషినీ 
సకల ప్రాణి లోకము నీ సంతతి కాదా 
సంరక్షణ నీ భారము దుర్గామాత
శరణు శరణు శరణు శరణు    వరముల దొరసాని 
చరణకమలములు నమ్మితి అమ్మ భవాని

Previous Post Next Post