ఏమని పొగదుడుమే యికనిను



 ఏమని పొగదుడుమే యికనిను

ఆమని సొబగుల అలమేల్మంగ 


 తెలికన్నుల నీ తేటలే కదవే
వెలయగ విభునికి వెన్నెలలు 
పులకల మొలకల పొదులివి గదవే
పలుమరు పువ్వుల పానుపులు 


 తియ్యపు నీమోవి తేనెలే కదవే
వియ్యపు రమణుని విందులివి
ముయ్యక మూసిన మొలక నవ్వు గదె
నెయ్యపు గప్పురపు నెరి బాగాలు

కైవసమగు నీ కౌగిలే కదవే
శ్రీ వేంకటేశ్వరు సిరి నగరు
తావు కొన్న మీ తమకములే కదే
కావించిన మీ కల్యాణములు
Previous Post Next Post