మహశక్తి మణిద్వీప నివాసిని
ముల్లొకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రరూపీణి
మన మనస్సులలో కొలువైయుంది
సుగంధ పుష్పాలెన్నోవేలు
అనంత సుందర సువర్ణ పూలు
ఆచంచ లంబగు మనోసుఖాలు
మణిద్వీపానికి మహానిధులు
లక్షల లక్షల లావణ్యాలు
అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు
మణిద్వీపానికి మహానిధులు
పారిజాత వన సౌగంధాలు
సూరాధినాధుల సత్సంగాలు
గంధర్వాదుల గానస్వరాలు
మణిద్వీపానికి మహానిధులు
పద్మరాగములు సువర్ణమణులు
పది ఆమడల పొడువున గలవు
మధుర మధుర మగు చందన సుధలు
మణిద్వీపానికి మహానిధులు
అరువది నాలుగు కళామతల్లులు
వరాల నొసగే పదారు శక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు
మణిద్వీపానికి మహానిధులు
అష్టసిద్ధులు నవ నవ నిధులు
అష్టదిక్కులు దిక్పాలకులు
సృష్టి కర్తలు సురలోకాలు మ
ణిద్వీపానికి మహానిధులు
కోటిసూర్యుల ప్రచండకాంతులు
కోటిచంద్రుల చల్లనివెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు
మణిద్వీపానికి మహానిధులు
కంచుగోడల ప్రకారాలు
రాగి గోడలా చతురస్రాలు
ఎడామడల రత్నరాశులు
మణిద్వీపానికి మహానిధులు
పంచామృతమయ సరోవరాలు
పంచలోహామయ ప్రకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు
మణిద్వీపానికి మహానిధులు
ఇంద్ర నీలమణి ఆభరణాలు
వజ్రపుకోటలు వైడూర్యాలు
పుష్యరాగమణిప్రాకారాలు
మణిద్వీపానికి మహానిధులు
సప్త కోటి ఘన మంత్ర విద్యలు
సర్వ శుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు
మణిద్వీపానికి మహానిధులు
మిలమిలలాడే ముత్యపు రాశుల
తళ తళ లాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకత మణులు
మణిద్వీపానికి మహానిధులు
కుభేర ఇంద్ర వరుణ దేవులు
శుభాలనొసగే అగ్నివాయువులు
భూమిగణపతి పరివారములు
మణిద్వీపానికి మహానిధులు
భక్తిజ్ఞాన వైరాగ్యాసిద్దులు
పంచభూతములు పంచశక్తులు
సప్తఋషులు నవగ్రహాలు
మణిద్వీపానికి మహానిధులు
కస్తూరి మల్లిక కుందవనాలు
సూర్యకాంతి శిలమహాగృహలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు
మణిద్వీపానికి మహానిధులు
మంత్రిణీ దండిని శక్తిసేనలు
కాళి కారాళీ సేనాపతులు
ముప్పది రెండుమహశక్తులు
మణిద్వీపానికి మహానిధులు
సువర్ణరజిత సుందరగిరులు
అనంగదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మిత గుహలు
మణిద్వీపానికి మహానిధులు
సప్త సముద్రములనంత నిధులు
యాక్షకిన్నెరా కింపురుషాదులు
నానాజగములు నదీనదములు
మణిద్వీపానికి మహానిధులు
మానవ మాధవ దేవగణములు
కామధేనువు కల్పతరువులు
సృష్టిస్తితిలయ కారణ మూర్తులు
మణిద్వీపానికి మహానిధులు
కోటిప్రకృతుల సౌందర్యాలు
సకల వేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మశక్తులు
మణిద్వీపానికి మహానిధులు
దివ్య ఫలములు దివ్యాస్త్రములు
దివ్య పురుషులు ధీరమాతలు
దివ్య జగములు దివ్య శక్తులు
మణిద్వీపానికి మహానిధులు
శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు
జ్ఞానముక్తి ఏకాంతభవనములు
మణినిర్మితమగు మండపాలు
మణిద్వీపానికి మహానిధులు
పంచ భూతములు యాజమాన్యాలు
ప్రవాళపాలం అనేక శక్తులు
సంతాన వృక్ష సముదాయాలు
మణిద్వీపానికి మహానిధులు
చింతామణుల నవరాత్రులు
నూరామడల వజ్రరాసులు
వసంత వనములు గరుడపచ్చలు
మణిద్వీపానికి మహానిధులు
ధుఃఖము తెలియని దేవీసేవలు
నటనాట్యలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్ధాలు
మణిద్వీపానికి మహానిధులు
పదునాలుగు లోకా లన్నిటిపైన
సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము
సర్వేశ్వరికది శాశ్వతస్తానం
చింతామణుల మందిరమందు
పంచబ్రహ్మల పంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో
నివసిస్తాడు మణిద్వీపములో
మణిగణ ఖచిత ఆభరణాలు
చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా
అగుపడుతుంది మణిద్వీపములో
పరదేవతను నిత్యముకొలచి
మనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి
మణిద్వీపేశ్వరి దీవిస్తుంది
నుతన గృహములు కట్టినవారు
మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు
చదివినచాలు అంతాశుభమే
అష్టసంపదల తులతూగేరు
శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి
మణిద్వీప వర్ణన చదివినచోట
తిష్టవేసుకొని కూర్చొనునంటా
కోటీశుభాలను సమకూర్చుటకై
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము
🕉️ దేవదేవుల నివాసము అదియే కైవల్యము 🕉️
ఫలశృతి :- పదునాలుగు లోకాలకూ పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని,
పరమేశ్వరిని, తొమ్మిది విధాలుగా కీర్తించుకొనుటకు 9 దోహలతో ఈ స్తోత్రం
వ్రాయబడింది. ఆమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని 9 పర్యాయములు
ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు. దీనిని శుక్రవారమునాడు మీ
పూజానంతరము తొమ్మిదిమార్లు పారాయణ లేదా గానం చేసిన ధన,
కనక, వస్తు, వాహనాది సంపదలు కలిగి భక్తి, జ్ఞాన వైరాగ్య సిద్దులతో ఆయురారోగ్య, ఇశ్వర్యాలతో తులతూగి చివరకు మణిద్వీపం చేరగలరు. ఇది శాస్త్రవాక్యం.
ఈ మణిద్వీప వర్ణన సంకీర్తన జరుప దలచిన వారు సంప్రదించండి
లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ
మచిలీపట్నం
9248951498