చిన్నికృష్ణ చేర రారా చిన్ని నాన్నా
కన్న తండ్రి వెన్న ఇదిగో వేగ రారా
ఉన్న వెన్నంత నీకేనురా
కన్న మన్నింక తిన బోకు రా.....ఓ.....
గొల్లవారి వారి వాడ చేరి గోల చేయకు
అల్లరి ఏమి చేయకు
వేళకాని వేళ నీవు కల్లలాడకు
నల్లనయ్య వేధించకు
చెల్లుబాటు కాదురా చిన్నతనము వీడరా
ఉన్న వెన్నంత నీకేనురా
కన్న మన్నింక తిన బోకు రా...ఓ...
భామలంతా కూడి యేటి స్నానమాడగా
చీరలు ఎత్తుకెల్లావాట
భక్తితోడ భామలంతా మ్రొక్కి వేడగా
కొమ్మ ఎక్కి ఉన్నావటా
ఎట్టాగయ్యా కన్నయ్య కాని పనులు వాడలో
ఉన్న వెన్నంత నీకేనురా
కన్న మన్నింక తిన బోకు రా...ఓ...
ఉట్టి మీద చట్టి దించి జతగాళ్ళతో
వెన్నంత తిన్నా వట
గట్టిగాను కొట్టబోతే పట్టు చిక్కకా
తప్పించుకున్నావట
నందబాలా ఎందుకు నాగుబాటు వాడలో
ఉన్న వెన్నంత నీకేనురా
కన్న మన్నింక తిన బోకు రా...ఓ...