పార్వతి తనయా గణపతి దేవా
మొరవిన రావయ్యా ఓ దేవా మొరవిన రావయ్యా
ముందుగ నీ నామమ్ము పలికేదా
ముక్తి మార్గమే వసగుమయా
నీ శరణములే మాకు రక్షయై
మమ్ములను కాపాడుమయ
|| పార్వతి తనయా ||
ఈశ్వర నందన విగ్నేశ్వర
మామొర లాలింపగ రవేమయా
మంగల హారతులందుకుని మాకు
అభయము నీయవయ
|| పార్వతి తనయా ||
గజముఖ వదనా గణపతి దేవా
భక్తులపాలిట దయామయా
భక్త దయామయ పూజలు గైకొని
నిత్యము మము కాపాడుమయ్య
|| పార్వతి తనయా ||