శ్రీ రామ కళ్యామే వెన్నెల
సీతమ్మ వైభోగమే వెన్నెల
అయోధ్య పురమున వెన్నలో వెన్నెల
దశరథ మహారాజుఅంట వెన్నలో వెన్నెల
ఆ రాజుకు ముగ్గురు వెన్నలో వెన్నెల
రానులే కలరంట వెన్నలో వెన్నెల
కౌసల్య సుమిత్ర వెన్నెల
కైకేయి చిన్న రాణి వెన్నెల
|| శ్రీ రామ కళ్యామే వెన్నెల ||
ఆ రాజుకు కొడుకులు వెన్నలో వెన్నెల
నలుగురు కలరంట వెన్నలో వెన్నెల
శ్రీ రామ లక్ష్మణులు వెన్నలో వెన్నెల
భరత శత్రుఘ్నులువెన్నలో వెన్నెల
శ్రీరామచంద్రుడంత వెన్నెల
గారాల కొడుకంట వెన్నెల
|| శ్రీ రామ కళ్యామే వెన్నెల ||
జనక మహారాజునకు వెన్నలో వెన్నెల
ఏకైక పుత్రికట వెన్నలో వెన్నెల
ఆ తల్లి పేరేమో వెన్నలో వెన్నెల
సీతమ్మ దేవి అంట వెన్నలో వెన్నెల
సీతమ్మకు రామయ్య వెన్నెల
కళ్యాణం జరిగిన అంట వెన్నెల
|| శ్రీ రామ కళ్యామే వెన్నెల ||
ముత్యాల పందిరిలో వెన్నలో వెన్నెల
రత్నాల తలంబ్రాలు వెన్నలో వెన్నెల
సీతారామ కళ్యాణం వెన్నెలో వెన్నెల
లోక కళ్యాణమంట వెన్నెలో వెన్నెల
కల్యాణం చూచినచో వెన్నెల
మన అందరి జన్మ ధన్యం అంట వెన్నెల
|| శ్రీ రామ కళ్యామే వెన్నెల ||
|| సీతమ్మ వైభోగమే వెన్నెల ||