తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో (2)
వెలసితివా ఆ శిఖరమున గుడి గంటల రవళులలో
శిలగా వెలశావే మా దేవుడ వైనావే
ఆకాశ రాజుకు అల్లుడ వైతివి (2)
పద్మావతికే ప్రియనాధుడవై (2)
శిలగా వెలశావే మా దేవుడ వైనావే
తిరుమల తిరుపతి లో ఆ బంగరు కోవెలలో (2)
శేషా శిఖరమే ఏడుకొండలై (2)
అలమేలు మంగను చెంతను వుంచి (2)
శిలగా వెలశావే మా దేవుడ వైనావే
తిరుమల తిరుపతి లో ఆ బంగరు కోవెలలో (2)
తెల్లా తెల్లని నామాలు పెట్టుకొని (2)
భక్తుల బ్రోవగ వెలసితి వయ్య (2)
శిలగా వెలశావే మా దేవుడ వైనావే
తిరుమల తిరుపతి లో ఆ బంగరు కోవెలలో (2)
వెలసితివా ఆశిఖరమున గుడి గంటల రవళులలో
శిలగా వెలశావే మా దేవుడ వైనావే
ఓం నమో నారాయణా శ్రీ లక్ష్మీ నారాయణా