Hara Hara O Girichara


 రచన : అనుపోజు లక్ష్మణరావు
( ఓం హరా శంకరా గీత రచయిత )

పల్లవి : హర హరా ఓ గిరిచరా ఆశ్రిత పాపహర ... ధీవరా కరుణగని ...గావమని 
పిలిచేరా... ప్రియమారా    
పిలిచేరా.. ప్రియమార త్వరరారా ..   || ఓ హర హరా||

చ1|| 
ఓ .... (గరళము జనియింప భయాన
సురలునిన్ స్మరియింప భయాన)-2 
(అరగియు  హాలాహలమును గ్రోలి , అమరుల గాచిన) - 2
పురహర , భవహర , పరమ కృపాకర , పుణ్య పురుష రారా ..           ||ఓ హరహరా ||

చ2||
ఓ .. (నినుగని వరియించి భవాని 
మనమున స్మరియింపగ బూని )-2
(తనవారిని కాదని నీ కొరకై , తపమును జేయ )-2
కనికరమున జని , వనితగ నిడుకొని ఘనత గొన్న సదయా..  
||ఓ హరహరా||

చ3||
ఓ .. (జంగమ వేషమును ధరించి 
జగతని దీనునిగ నటించి)-2
(సంగ్రహించిన కఫాలంబుతో సర్వము తిరిగిన) -2
అంగజ భంగ , భుజంగ విభూషణ , అమర సంఘలింగా ...
||ఓ హరహరా||

చ4||
ఓ.. (నెలధరా వైశాఖ పురానా 
నిలచిన నిజభక్త నిదాన )-2
(ఇలలో లక్ష్మణరావుని గావా , ఇటు త్వర రావా) -2
వెలదిని తలగొని మెలగుట వలదని వెలితి చేసినానా ...
||ఓ హరహరా ||

Previous Post Next Post