నేను పువ్వునై హనుమ పాదాల మీద వాలుతా
నేను జ్యోతినై హనుమ మందిరంలో వెలుగుతా
ఈ జన్మలోనూ మరే జన్మలోనైనా
జన్మజన్మలా హనుమ పాదసేవ చేసుకుంటా…{ నేను పువ్వునై }
1 వ చరణం
హనుమ పాద సేవ అది ఇహపరానికే త్రోవ
దానికన్న మిన్నలేదు వినరా ఓ జీవ
ద్రోహబుద్ధి వీడరా దాసోహం చేయరా
శ్రీ హనుమానుని నిరతము మదిలో సేవించు { నేను పువ్వునై }
2 వ చరణం
దేహమనే బుడగయందు అహము అనే గాలిఉంది
అహముతో ఇహమునే శాశ్వత మను కోకురా
అక్షర సుమమాలతో అల్లినాను గేయాలను
గేయ కావ్యమాల హనుమ,గళము నందు,ఉంచు { నేను పువ్వునై }
3 వ చరణం
శ్రీ ఆంజనేయుడు శ్రీ రాముని దాసుడు
శ్రీ రామ సేవ చేసేను శ్రీ రామ కరుణ పొందెను
ఆంజనేయుని దయవుంటే కోర్కెలు నెరవేరును
చాలీసా పాడి హనుమ అనుగ్రహము పొందు { నేను పువ్వునై }