కళ్యాణము చూతము రారండి
శ్రీశైల వాసుని కళ్యాణము చూతము రారండి
కళ్యాణము చూతము రారండి శ్రీ గౌరీశంకర
కళ్యాణము చూతము రారండి
1 వ చరణం
చూచువారులకు చూడ ముచ్చటట
పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట
భక్తి యుక్తులకు ముక్తిప్రదమట
సురలను మునులను చూడవచ్చునట
2 వ చరణం
శ్రీహరి బ్రహ్మాలు లక్ష్మీవాణి { లక్ష్మీ వాణి }
ప్రమద గణములు నంది కేసులు { నంది కేసులు } 2 సార్లు
శ్రీ శైలేశుని కళ్యాణానికి ఆ ఆఆఆ ఆఆఆ ఆ ఆ
శ్రీ శైలేశుని కళ్యాణానికి మునులు సురలు, కిన్నెర లతిధులు
3 వ చరణం
శివుడే పతి అని కోరిన తల్లి { వేడిన తల్లి }
శ్రీ భ్రమరాంబ మమతల మల్లి { మమతల మల్లి }2 సార్లు
ఆది దేవుని పతిగా పొందిన ఆ ఆఆఆ ఆఆఆ ఆ ఆ
ఆది దేవుని పతిగా పొందిన మైధిలి నందిని అఖిలాండేశ్వరి
4 వ చరణం
నీలకంఠుని కరములు తాకి { కరములు తాకి }
శ్రీ భ్రమరాంబ గళమున మెరసి { గళమున మెరసి }2 సార్లు
అస్తిత్తమొందిన బంగారు తాళి ఆ ఆఆఆ ఆఆఆ ఆ ఆ
అస్తిత్తమొందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి
5 వ చరణం
శివపార్వతుల కల్యాణ వైనం { కల్యాణ వైనం }
అఖిల జగాలకు సిరుల తోరణం { సిరుల తోరణం }2
ఆది దంపతుల కళ్యాణమె ఆ ఆఆఆ ఆఆఆ ఆ ఆ
ఆది దంపతుల కళ్యాణమె లోక మంతటికి మహదానందం
ఆనంద మానంద మాయేనే మన శివయ్య పెళ్లి కొడుకు కాయెనే
ఆనంద మానంద మాయేనే మన పార్వతి పెళ్ళి కూతురాయెనే
ఆనంద మానంద మాయేనే ఇది లోక కళ్యాణ మాయెనే
ఆనంద మానంద మాయేనే ఎంతో ఆనంద మానంద మాయేనే