Chakkanodu Okkadanta

 

హరికాంబోజి రాగం తిశ్రగతి తాళం

పల్లవి 
సక్కనోడు ఒక్కడంట గోవిందుడే తానంట
చూడ చూడ ముచ్చటంట గోవిందుని రూపమంట 2 సార్లు 

1 వ చరణం 
గోవర్ధన మెత్తినోడు గోవుల్ని కాచినోడు 
గోవిందుని పేరు దాల్చి తిరుమలగిరి కొచ్చినోడు
కూర్చొనక నిలుచుండే  ఏడుకొండల వెంకటయ్య 2 సార్లు 

2 వ చరణం 
శంఖు చక్రం చేతబట్టి ప్రేమ మీర అభయమిస్తు
నీవు నన్ను శరణు అంటే నిన్ను నేను బ్రోచునంటు
సత్యమంటు పలుకువాడు ఏడుకొండల వెంకటయ్య 2 సార్లు 

3 వ చరణం 
సద్ది బువ్వ సంకనెట్టి ముల్లు కర్ర సేతబట్టి 
ఆలమందు తోలుకొంటు పదమునేను పాడుతుంటే 
కదము తొక్కు తొచ్చు వాడు ఏడుకొండల వెంకటయ్య 2 సార్లు 

4 వ చరణం 
పూజలన్నీ చేయలేను పప్పు లొండి పెట్టలేను 
ఆవు పాలు తెచ్చి నీకు బొజ్జ నిండా నింపుతాను 
కాదనక తాగవయ్య ఏడుకొండల వెంకటయ్య 2 సార్లు 

5 వ చరణం 
బాల రత్నమ్మ అంట నిన్ను నమ్మి ఉన్నదంట 
పదములన్ని రాసుకుంటు ఎదురు చూసు చున్నదంట
మారాము చేయకయ్యా ఏడుకొండల వెంకటయ్య 2 సార్లు 

పల్లవి 
సక్కనోడు ఒక్కడంట గోవిందుడే తానంట
చూడ చూడముచ్చటంట గోవిందుని రూపమంట 2 సార్లు

Previous Post Next Post