Chakkanayya Sai Baba


చక్కనయ్యా సాయి బాబా ఎక్కడున్నావు
ఎంత వేడిన చింత తీర్చవు ఏమి నా నెపమూ
 ॥ చక్కనయ్యా ॥ 

1 వ చరణం 
ఎందువెదకిన అందే కలవని ఎందరెందరో అందురే
ఎందు వెతకిన అందేకలవని ఎందరెందరో అందురే
ఎందు వెదకిన కానరావు 2 సార్లు 
ఏమి నా నెపమూ ఏమి మా నెపమూ ॥ చక్కనయ్యా ॥ 

2 వ చరణం 
చింత బాపెడి నీదు నామము భక్తితో నే చేయలేదని 2 సార్లు 
వింత మనిషిగ ఎంచినావా. పంతమేలనయ్యా మా చింత తీర్చవయా
 ॥ చక్కనయ్యా ॥ 

3 వ చరణం 
ధానధర్మము చేయలేదని 
దానవునిగా ఎంచినావా 
మనసు విప్పి మాటిలాడవు . మౌన మేలనయా 
పలుక వేలనయా
॥చక్కనమ్మ

4 వ చరణం 
అండపిండ బ్రహ్మాండనాయక 
ఆశ్రితానంద దాయక 
అండ నీవని ఆశ్రయించితి.. ఆదరింపుమయా
మమ్ము కనికరించవయా
 

Previous Post Next Post