Nee sari Evarayya || Hanuman Song Lyrics || నీసరి ఎవరయ్య


 నీసరి ఎవరయ్య అంజనా కేసరి హనుమయ్య
దాసుడ నేనయ్యా బ్రతుకున బాసట నీవయ్యా 

1 వ చరణం
చూసి రమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు
లంకను కాల్చి వచ్చినావు   2 సార్లు
సీతను చూసి వచ్చినావు శిరోమణి తీసుకొచ్చినావు.
|| నీసరి ఎవరయ్యా || 

2 వ చరణం
రామచంద్రుని ఆలింగన సన్మాన మొంది నావు
శ్రీ రామ పాదము పొందినావు   2 సార్లు
రాముని కరుణ పొందినావు 
నిజముగ రామబంటు నీవు   
|| నీసరి ఎవరయ్య || 

3 వ చరణం
భక్తి పరిక్షకు నిలబడి మరి నీ గుండె చీల్చి నావు
రాముని యదను చూపినావు   2 సార్లు
అనితర భక్తి చాటినావు
భక్తికి మారుపేరు నీవు
//నీసరి ఎవరయ్య// 

4వ చరణం
రామ రామ యని ఘోషించే జప సాగరమే నీవు
శ్రీ రామ నామాంబుది నీవు    (2)
రాముని భక్తులకే నీవు 
ఆత్మ బంధువు అయి నావు 

 జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్

లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం

Previous Post Next Post