నాగయ్య నాగప్పా నాగరాజా
మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా 2 సార్లు
నాగయ్య నాగప్పా నాగరాజా
మా కోర్కెలన్ని తీర్చవయ్య నాగరాజా 2 సార్లు
1 వ చరణం
నందునికి మిత్రుడవయ్య నాగరాజా
నీవు అతి కోప దారివయ్య నాగరాజా
నాగయ్య నాగప్పా నాగరాజా
మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా 2 సార్లు
2 వ చరణం
పరమ శివుని మెడలోని నాగరాజా
నీవు పరవ శించి ఆడవయ్య నాగరాజా
నాగయ్య నాగప్పా నాగరాజా
మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా 2 సార్లు
3 వ చరణం
ఆవు పాలు తెచ్చామయ్య నాగరాజా
నీవు ఆరగించి బ్రోవవయ్య నాగరాజా
నాగయ్య నాగప్పా నాగరాజా
మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా 2 సార్లు
4 వ చరణం
నాగ స్వరం వూదామయ్య నాగరాజా
నీవు పరవ సించి ఆడవయ్య నాగరాజా
నాగయ్య నాగప్పా నాగరాజా
మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా 2 సార్లు
5 వ చరణం
అభిషేకం చేశా మయ్య నాగరాజా
రాహూ కేతు భాద తొలగించు నాగరాజా
నాగయ్య నాగప్పా నాగరాజా
మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా 2 సార్లు
6 వ చరణం
నీ భజన చేస్తున్నాము నాగరాజా
మమ్ము కరుణించి కాపాడయ్య నాగరాజా
నాగయ్య నాగప్పా నాగరాజా
మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా 2 సార్లు
మా కోర్కెలన్ని తీర్చవయ్య నాగరాజా
నాగరాజా శివ నాగరాజా
నాగరాజా మముబ్రోవరార