పిలచిన పలికేవా ఓ కోడె నాగన్న
మురిపెము తోడనే నిను కొని యాడెద రారా 2 సార్లు
కాకాని సాంబశివుని మెడలో వున్నావా
సింగరాయ పాలెంలో నీవె స్థిరముగ వున్నావా 2
నిన్నే నమ్మి భజనలు చేసే భక్తుల్ని బ్రోవవయ్యా 2
నీవే దిక్కని పాటలు పాడే భక్తుల్ని బ్రోవవయ్యా
రావయ్య నాగేంద్ర దిగి రావయ్య నాగేంద్ర 2
పిలచిన పలికేవా ఓ కోడె నాగన్న
మురిపెము తోడనే నిను కొని యాడెద రారా 2 సార్లు
పళని సుబ్రహ్మణ్యేశ్వరునిగ ఇలలో వెలశావా
మోపిదేవి క్షేత్రము లోన కొలువై ఉన్నావా 2 సార్లు
రైలుపేట ప్రాంతంలోన కొలువై ఉన్నావా
నాగాంజనేయ స్వామిగ నీవు వెలసి ఉన్నావా
నిన్నే నమ్మి భజనలు చేసే భక్తుల్ని బ్రోవవయ్యా 2
నీవే దిక్కని పాటలు పాడే భక్తుల్ని బ్రోవవయ్యా
రావయ్య నాగేంద్ర దిగి రావయ్య నాగేంద్ర 2
పిలచిన పలికేవా ఓ కోడె నాగన్న
మురిపెము తోడనే నిను కొని యాడెద రారా 2 సార్లు
భక్తులంతా కలసి నీదు భజనలు చేసెదమే
భజనకు రావయ్య నాగ దీవించి బ్రోవవయా
రావయ్య నాగేంద్ర దిగి రావయ్య నాగేంద్ర 2
పిలచిన పలికేవా ఓ కోడె నాగన్న
మురిపెము తోడనే నిను కొని యాడెద రారా 2 సార్లు
రావయ్యా నాగన్న దిగి రావయ్యా నాగన్న 2 సార్లు
ఏమని పిలవమయా నిన్నేమని కొలవమయా 2 సార్లు
రావయ్య నాగన్న దిగి రావయ్యా నాగన్న 2 సార్లు
రావయ్య నాగన్న దిగి రావయ్యా నాగన్న 2 సార్లు