ఓహో ఆంజనేయ కరుణాల




ఓహో ఆంజనేయ కరుణాల ఆంజనేయ 2 సార్లు 


చల్లగా రావయ్య మెల్లగా రావయ్యా 2 సార్లు


చల్లగా రావయ్య మెలమెల్లగా రావయ్యా 2 సార్లు 



1 వ చరణం


మంగళవారం నాడు నీకు ఆకు పూజలే 


మంగళవారం నాడు నీకు ఆకు పూజలే స్వామి 


 హనుమ భజనలే   { బిక్ష భజనాలే }



ఎలన్నయ్య ఆంజనేయ 2 సార్లు 


 కోపమేలయ్య


మాపై కరుణ చూపవయ్యా


చల్లగా రావయ్య మెలమెల్లగా రావయ్యా



2 వ చరణం


భక్తులంతా కలిసి నీదు భజన చేసేదమే


భక్తులంతా కలిసి నీదు భజన చేసేదమే


నీదు పాటలు పాడెదమే


ఏలనయ్య ఆంజనేయ 2 సార్లు


కోపమేలయ్య మాపై ప్రేమ చూపవయ్యా


చల్లగా రావయ్య మెలమెల్లగా రావయ్యా 2 సార్లు 



3 వ చరణం


రైలు పేట ప్రాంతమందున వెలసిన వయ్యా


రైలు పేట ప్రాంతమందున వెలసిన వయ్యా స్వామి


నాగాంజనేయునిగ 


వేగమెరావ ఆంజనేయ 2 


కోపమేలనయ్య మాపై జాలి చూపవయ్యా


చల్లగా రావయ్య మెలమెల్లగా రావయ్యా



4 వ చరణం


కడలిదాటి లంకకుచేరి సీతను చూసితివే 


కడలిదాటి లంకకుచేరి సీతను చూసితివే స్వామి 


ఉంగర మిచ్చితివే


సీత క్షేమ  వార్త తెలిపి 2


శుభము కూర్చితివే రాముని కరుణ పొందితివె


చల్లగా రావయ్య మెలమెల్లగా రావయ్యా



ఓహో ఆంజనేయ కరుణాల ఆంజనేయ 2 సార్లు 


చల్లగా రావయ్య మెలమెల్లగా రావయ్యా 2 సార్లు


Previous Post Next Post