అమ్మా వచ్చిందే.... తల్లీ వచ్చిందే.....
బెజవాడ కనక దుర్గమ్మ వచ్చిందే....
అమ్మా వచ్చిందే తల్లీ వచ్చిందే,
బెజవాడ కనక దుర్గమ్మ వచ్చిందే
ముగ్గురమ్మల మూలపుటమ్మ, సృష్టికి మూలం నేవేనమ్మ(2)
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పూజించే శక్తివి నీవే (అమ్మా వచ్చిందే)
కృష్ణ నదిలో జలకమాడి, కాళ్ళకు పారాణి పెట్టి (2)
మొకమంతా పసుపుతోన ఎర్రని బొట్టు పెట్టి
కాళ్ళకు గజ్జెలు కట్టుకోని, కంటికి కాటుక పెట్టుకోని
పట్టుచీరనే కట్టుకోని.. మహలక్ష్మిలా.... వచ్చే తల్లీ (అమ్మా వచ్చిందే)
కంచిలోన కామాక్షివి నీవే, మధురలోన మీనక్షివి నీవే
దుర్గమ్మ తల్లివి నీవే, కదిలొచ్చే కాళి మాతవు నీవే
చేతికి గాజులు వేసుకోని, చేతిలో శూలం పట్టుకొని
పెద్దపులినే ఎక్కివచ్చే... ముల్లోకాలు తిరిగేతల్లి.... (అమ్మా వచ్చిందే)
ఆది శక్తివి నీవే, అన్నపూర్ణవీ నీవే
సర్వ జనులుకాచే సర్వ శక్తివి నీవే
దండాలు దండాలు అమ్మోరు తల్లో....
శతకోటి దండాలు అమ్మోరు తల్లో....
కరుణించి కాపాడు అమ్మోరు తల్లో....
మమ్మేలే మాతల్లి అమ్మోరు తల్లో.... (అమ్మా వచ్చిందే)