శ్రీ లక్ష్మీదేవి,,, మా,,, పూజలు గైకొనుమా
శ్రీ లక్ష్మీదేవి,,, మా,,, పూజలు గైకొనుమా
1 వ చరణం
క్షీరసాగర మందు జన్మించితి ఓయమ్మా
శ్రీహరి హృదయములోన నెలకొంటివి మాయమ్మా
సిరివయ్యి విశ్వమున విలసిల్లితి వమ్మా
2 వ చరణం
ఆదినారాయణుని అర్ధాంగి రావమ్మా
ఆదిలక్ష్మి మాపై ఆదరణ చూపవమ్మా
నీ దివ్య పదములనే మది నమ్మితి మమ్మా
3 వ చరణం
అష్టలక్ష్మిగా నీవు అలరారు చుంటివమ్మా
నిష్టతో నేను కొలిచేటి అదృష్టమే మాదమ్మా
కష్టములు కడతేర్చు కనకమహాలక్ష్మి
4 వ చరణం
దాసకోటిని బ్రోచే ధనలక్ష్మివి నీవమ్మా
దారిద్ర్యము బాబేటి ధాన్యలక్ష్మివి నీవమ్మా
దయగనుమా మొర వినుమా దర్శనమివమ్మా
శ్రీ లక్ష్మీదేవి,,, మా,,,, పూజలు గైకొనుమా
శ్రీ లక్ష్మీదేవి,,, మా,,,, పూజలు గైకొనుమా
మా, పూజలు గైకొనుమా మా,పూజలు గైకొనుమా
మా,,,, పూజలు గైకొనుమా