Manasara Hari Bhana Cheyara || మనసారా హరి భజన చేయరా




 

రాగం సింధు భైరవి శ్రుతి 6 1/2 

తాళం చతురస్రం నడక 4 4 అంటారు 


పల్లవి 

మనసారా హరి భజన చేయరా 

నీ నోరార నారాయణా యనరా  2 సార్లు 


1 వ చరణం 


పాటే రాదని ప్రజలు నవ్వుదురని  "2"

గాత్ర శుద్ధియే కమ్మగ లేదని  2 సార్లు 

పాటకు సరియగు తాళము లేదని "2"

భయమూ బిడియము బాధ వలదురా "మనసారా”


2 వచరణం


పాటయు తాళము గాత్రమున్ననూ "2"

మనసే లేని స్మరణే వృధరా  "2"

మనసొక  చోట తనువొక  చోట"2 సార్లు 

వున్న మానవుని జన్మమే వృధర "మనసారా "


3 వచరణం


యోగులైన మహా బోగులైనా  "2"

పూర్వ జన్మ సుకృతమే పోదురా  "2"

నారాయణుయని నామస్మరణచే"2 సార్లు 

నరకపు బాధలు నాశనమవురా2 సార్లు "మనసారా”


4 వ చరణం


చిత్తము నిలుపుచు శ్రీహరి మీదను 2 సార్లు 

చేసెడి ధ్యానమే సార్దకమవునుర 2 సార్లు 

నారాయణుని నమ్మి భజించితే 2 సార్లు 

మోక్షపు మార్గము సుగమము అగురా 2 సార్లు 


పల్లవి 

మనసారా హరి భజన చేయరా 

నీ నోరార నారాయణా యనరా  2 సార్లు 


నారాయణా శ్రీమన్నారాయణ 

నారాయణా లక్ష్మీ న్నారాయణ 4 సార్లు 


లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమీ 

మచిలీపట్నం 9248951498

Previous Post Next Post